Friday, November 22, 2024

ఒకే టేక్ లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం.. 400 అడుగుల రైలు తయారీ

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : రణబీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌, లార్జర్‌ దాన్‌ లైఫ్‌ క్వింటె సెన్షియల్‌ హిందీ సినిమా షంషేరా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన యాక్షన్‌ సెట్లను రూపొందించామని దర్శకుడు కరణ్‌ మల్హోత్రా తెలిపారు. రణబీర్‌ నటించిన ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఒక రైలులో జరుగుతుందని, ఆ సన్నివేశం కోసమే 1800 కాలం నాటి థీమ్‌ తో 400 అడుగుల పొడవైన రైలును నిర్మించామని తెలిపారు. దీనిగురించి కరణ్‌ వివరిస్తూ తమ సెట్‌ డిజైన్‌ నుంచి యాక్షన్‌ సెట్స్‌ వరకు, షంషేరా సినిమా ప్రేక్షకులకు మరపురాని విజువల్‌ ట్రీట్‌ను అందించేలా తెరకెక్కించామని, తాము ఏం చేసినా అది సినిమా, అప్పటి కాలం నాటిదే అనిపించాలని అందరికీ స్పష్టం చేశానన్నారు.

జీవితంకన్నా పెద్దదైన యాక్షన్‌ సీక్వెన్స్‌ రైలులో జరుగుతుంది. దాన్ని 1800ల కాలం నాటి రైల్లోనే చిత్రీకరించవలసి ఉండడంతో ఆ సవాల్‌ను అధిగమిస్తూ రైలును మేమే తయారు చేశామని వివరించారు. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ కోలాహలాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇది జులై 22న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement