Monday, November 18, 2024

సౌదీ అరేబియా వేదికగా ఫుట్‌బాల్‌ ఏసియా కప్‌!

ఫుట్‌బాల్‌ సీనియర్‌ మెన్స్‌ ఏసియన్‌ కప్‌ 2027 టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించి భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్‌సీ ఏసియన్‌ కప్‌ 2027 టోర్నమెంట్‌ను భారత్‌ వేదికగా నిర్వహించాలని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య భావించి, అందుకు సంబంధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య టెండర్‌ బిడ్‌ల్లో పాల్గొంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ఏసియన్‌ కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం కంటే, దేశీయంగా క్రీడాకారులను తీర్చిదిద్దడం, మౌలిక సదుపాయాల కల్పన, అసోసియేషన్లను బలపరచడంపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు కల్యాణ్‌ చౌబే తెలిపారు.

ఫిఫా అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ తదితర అంతర్జాతీయ టోర్నీలు ఎన్నో నిర్వహించామని, ఆ అనుభవముందని పేర్కొన్నారు. బిడ్‌ నుంచి భారత్‌ వైదొలగిన నేపథ్యంలో సౌదీఅరేబియా మాత్రమే బిడ్‌ దక్కించుకోనుంది. దీంతో 2027 ఏసియా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ సౌదీ అరేబియా వేదికగా జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement