హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షను ఈనెల 7న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సోమవారం ప్రకటనలో తెలిపారు. అయితే ఆఖరు నిమిషంలో ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత ముందుగానే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. హాల్టికెట్ మీద పేర్కొన్న నిబంధనలను అభ్యర్థులు తప్పక పాటించాలని స్పష్టం చేసింది.