రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే.
అయితే, ఆ ఘటన మరువక ముందు తాజాగా, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన విద్యార్థినులను తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.