ప్రభుత్వం నిర్లక్ష్యమేనంటూ కేంద్ర మంత్రి బండి ఫైర్
ఫుడ్ పాయిజినింగ్ వారసత్వంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు
మార్పు అంటు అధికారంలోకి వచ్చి మోసం చేసిన రేవంత్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇప్పటికీ తమ ప్లేట్లలో విషమే తింటున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుడ్ పాయిజనింగ్ అనేది చేదు వారసత్వంగా వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు.
మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్పా.. పిల్లల దుస్థితిలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదని, ఆ పార్టీ నమ్మక ద్రోహనికి నిదర్శనం అని విమర్శించారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.