Thursday, November 21, 2024

Followup : లాభాల బాట పట్టిన మార్కెట్లు..

ముంబై: వరసగా మూడు రోజులుగా జరుగుతున్న నష్టాల పరంపరకు నేడు బ్రేక్‌ పడింది. అగ్రశ్రేణి కంపెనీల షేర్ల ధరలు పెరగడంతో స్టాక్‌ మార్కెట్లు లాభాల పట్టాయి. దాదాపు ఒక శాతం అధికంగా ట్రేడ్‌ అయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌, ఐటీ షేర్లు లాభాలు గడించాయి. ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గురువారం 503.27 పాయింట్లు పెరిగి 54,252.53 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 144.35 పాయింట్లు పెరిగి 16,170.15 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హౌసింగ్‌ డవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి సంస్థలు అత్యధిక లాభాలు గడించాయి. కాగా… రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ వంటి సంస్థల షేర్లు నష్టాలు పొందాయి.

ఆయా రంగాలకు సంబంధించిన ఇండిసీస్‌ విషయానికి వస్తే బ్యాంక్‌ నిఫ్టీ 2.20 శాతం పెరిగింది. అదేవిధంగా నిఫ్టీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 1.97 శాతం, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.67 శాతం, నిఫ్టీ ఐటీ 1.33 శాతం పెరిగాయి. ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 314.39 పాయింట్లు పెరిగి 22,143.45 పాయింట్లకు చేరుకున్నది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 194.75 పాయింట్లు పెరిగి 25,318.05 చేరుకున్నది. ఇండియా వీఐఎక్స్‌ 10.14 శాతం పడిపోయింది. ఇక ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. ఆర్థిక వృద్ధి మందగించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement