హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం కెమికల్ పేలుడు సంబవించింది. ఈ ఘటనలోఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అఫ్జల్‌గంజ్ పరిసర ప్రాంతంలోని మొగురం బస్తీలో భరత్ (37) అనే వ్యక్తి గిరిరాజ్ కెమికల్ కంపనీలో పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు కంపనీ నుంచి ఇంటికి కెమికల్ తీసుకు వచ్చేవాడు. ఆదివారం ఉదయం గడువు తీరిన కెమికల్ ఇంట్లో ఉందని గుర్తించిన భరత్ దాన్ని మురికికాలువలో పోశాడు.
అనంతరం వేడి నీటిని పోయడంతో ఒక్కసారిగా పేలుడు సంబవించింది. ఈ ఘటనతో భరత్ దాదాపు మూడంతస్థుల ఎత్తు వరకు ఎగిరి కిందపడటంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమీపంలోనే ఉన్న భరత్ తండ్రి వేణుుగోపాల్‌కు గాయాలయ్యాయి. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో పరిసర ప్రాంతాలలోని వారంతా వచ్చి పరిస్థితిని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భరత్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.