Saturday, November 23, 2024

Followup : కేసుల చిక్కుముడి వీడేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్లు అవసరం : తానేటి వనిత..

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో : నేరపూరిత అంశాలకు సంబంధించి సత్వర విచారణ జరిగేందుకు ఫోరెన్సిక్‌ పరిశోధన కేంద్రాలు తోడ్పడుతాయని, ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీస్‌ శిక్షణ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోరిన్సిక్‌ ల్యాబ్‌ ను రాష్ట్ర డిజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోలీసులకు నేర పరిశోధన అంశాలలో పూర్తి స్వేచ్ఛ కల్పించారని, రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరిగిన సత్వరం కేసుల విచారణకు అవసరమైన సదుపాయాలు చేకూర్చారని చెప్పారు.

పోలీసు శాఖలో పలు మార్పులను తీసుకువచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు తీసుకువచ్చి సమీప పోలీస్‌ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారని ఆమె అన్నారు. అనంతపురం శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగే నేరాలకు సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వారికి సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement