ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది వాహనదారులకు గుడ్ న్యూస్. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజెల్ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్, డీజెల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్టు తెలిపారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజెల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించనున్నట్టు ఆమె వెల్లడించారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, డీజెల్ ధర రూ.7 మేర తగ్గనుంది. ఈ సందర్భంగా వరుస ట్వీట్స్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. పెట్రోల్, డీజెల్‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో.. లక్షల కోట్ల భారం కేంద్ర ఖజనాపై పడుతుందన్నారు. రాష్ట్రాల్లో పెట్రోల్‌పై అదనంగా మరో రూపాయిన్నర తగ్గే అవకాశం ఉందన్నారు. డీజెల్‌పై అదనంగా మరో రూపాయి తగ్గే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. కేంద్రం మాత్రం సుంకం తగ్గించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చెప్పలేమన్నారు. కేంద్రం విధించే ఎక్సైస్ సుంకం తగ్గింపు అంశం అనేది రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయన్నారు.
గతేడాదీ.. ఎక్సైజ్ సుంకం తగ్గింపు..
గతేడాది దీపావళికి ముందు కూడా పెట్రోల్, డీజెల్‌పై కేంద్రం సుంకం తగ్గింంచినా.. కొన్ని రాష్ట్రాల మాత్రం అమలు చేయలేవని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకని ప్రధాన్‌మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకొచ్చామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ తగ్గింపును గతంలో అమలు చేశాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిరుపేదలపై భారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న ఆలోచనతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. కేంద్రం ప్రతీ ఏడాది రూ.లక్ష కోట్లు కోల్పోతుందని గుర్తు చేశారు.
అదేవిధంగా డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో కూడా ఆమె కీలక ప్రకటన చేశారు. గ్యాస్ బండపై సబ్సిడీని పెంచుతున్నట్టు వెల్లడించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై రూ.200 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ నిర్ణయం.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అక్కలు, చెల్లెళ్లు, అమ్మలకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద 9కోట్ల మంది లబ్దిదారులు ఉన్నట్టు వివరించారు. వీరంతా.. 12 గ్యాస్ సిలిండర్లపై రూ.200 రాయితీ పొందుతారని ప్రకటించారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై ఏడాదికి రూ.6100 కోట్ల భారం పడుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతుంటే.. తాము తగ్గించామన్నారు. ఎరువులపై రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీ బడ్జెట్‌లో ప్రకటించామని గుర్తు చేశారు. అదనంగా రైతుల మేలు కోసం రూ.1.10 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు.
ఏడాదికి 12 సిలిండర్లు.. ప్రపంచ వ్యాప్తంగా దారుణ పరిస్థితులు..
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుందన్నారు. పొరుగు దేశాల మాదిరి పెట్రోల్, డీజెల్‌పై భారీ వడ్డనలు చేయలేదన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని, వాటితో పోలిస్తే.. భారత్‌లో సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయని వివరించారు. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి గాయాల నుంచి కోలుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.
యుద్ధం కారణంగా దెబ్బతిన్న సప్లయి చైన్..
ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంపెరిగేందుకు కారణమైందన్నారు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఫలితంగా.. సప్లై చైన్ దెబ్బతిన్నదని గుర్తు చేశారు. ఇది ఎన్నో సమస్యలను తీసుకొచ్చిందని, కీలక వస్తువుల కొరత తీవ్రంగా ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామాల కారణంగానే.. ప్రపంచంలోని చాలా దేశాల ద్రవ్యోల్బణాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వివరించారు. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని, అందుకే చమురు ధరలను తగ్గి…
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..