హైదరాబాద్, ఆంధ్రప్రభ : సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న నిరుపేదలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఈ రోజు (ఆదివారం) ఆయన ఒక ట్వీట్ చేశారు. సత్ఫలితాలనిస్తోన్న దళిత బంధు పథకంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రవేశపెట్టారన్నారు. దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైందని ట్వీట్ చేశారు.
లింకురోడ్లతో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ…
హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రాజధాని నగరంలో మరిన్ని లింకు రోడ్లను సృష్టించడం ద్వారా వాహనదారులకు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 10 మునిసిపాలిటీలకు ఈ పరిధిని ప్రభుత్వం విస్తరించిందని, తెలంగాణ ప్రభుత్వం 104 కొత్త లింకురోడ్ల కోసం రూ.2410 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. దీంతో రోడ్లు విశాలంగా మారి గమ్యాన్ని ప్రజలు త్వరగా చేరుకునే అవకాశం ఉందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.