కార్పోరేట్ ఆర్థిక ఫలితాలు బలంగా ఉండటంతో సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు రోజంగా ఉత్సహంగా చలించాయి. అన్ని సూచీలు సానుకూలంగా కదలాడాయి. దీంతో వరసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలు కొనసాగాయి. రూపాయి కోలువడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, దిగ్గజ కంపెనీ రిలయన్స్ షేర్ల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 545.25 పాయింట్ల లాభంతో 58600 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 181.80 పాయింట్ల లాభంతో 17340 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 56 రూపాయలు తగ్గి 51370 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 230 పెరిగి 58600 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 79.58 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా మోటార్స్, ఆదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, సిప్లా కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, దీవిస్ ల్యాబ్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.