Monday, November 18, 2024

Dense Fog :ఆ రాష్ట్రాల్లో కమ్ముకున్న పొగమంచు…త‌మిళ‌నాడు, కేర‌ళ‌కు వ‌ర్ష సూచ‌న‌..

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి.

తమిళనాడు, కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, మహే, పుదుచ్చేరి, కారైకల్ ,లక్షద్వీప్‌లలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ హైవేపై 200 నుంచి 300 మీటర్ల వరకు దృశ్యమానత తక్కువగా ఉంది. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు హైవేపై పలుచోట్ల పొగమంచు అలర్ట్‌ను ప్రదర్శించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, పాటియాలలో దృశ్యమానత సున్నా వద్ద నమోదైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పొగమంచుతో కూడిన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత సున్నాకి తగ్గిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement