హైదరాబాద్, ఆంధ్రప్రభ : ర్రైళ్ల రాకపోకల సమయపాలనకు ఆటంకాలు కలిగించే అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ బుధవారం అధికారులతో చర్చించారు. ఇందుకు సంబంధించి లోకో పైలట్లకు, అసిస్టెంట్ లోకో పైలట్లకు భద్రతా చర్యలపై క్షేత్ర స్థాయిలో సెమినార్లు నిర్వ#హంచాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాలను తరచూ నిర్వ#హంచేలా దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యక్తిగత కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కౌన్సెలింగ్‌తో వారు నిబంధనలను ఉల్లంఘించకుండా భద్రతా అంశాలను కచ్చితంగా పాటిస్తారన్నారు. అనంతరం పని ప్రదేశాలలో భద్రతకు కావాల్సిన అంశాలు సజావుగా ఉన్నాయని నిర్దారించుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తనిఖీలను కచ్చితంగా మెరుగుపర్చాలన్నారు.
జోన్లో సరుకు రవాణా లోడింగ్ పనితీరును కూడా జీఎం సమీక్షించారు. జోన్ పరిధిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను తీర్చేలా బొగ్గు లోడింగ్‌ను అభివృద్ధి చేయాలని నొక్కిచెప్పారు. బొగ్గు రవాణాను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సరుకు రవాణా రంగంలో నూతనంగా చేరిన సరుకుల వివరాలను ఆరు డివిజన్ల బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు సమావేశంలో సంక్షిప్తంగా వివరించాయి. వారి కృషిని అభినందించిన జీఎం సరుకు లోడింగ్ మరింత బలోపేతం కావడానికి, రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఉండే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైళ్ల వేగ పరిమితిపై కూడా జీఎం సమీక్ష నిర్వహించారు. రైళ్లు మరింత వేగంగా ప్రయాణించేందుకు తీసుకోవాల్సిన పలు చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, #హదరాబాద్, నాందేడ్ ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు.