మ్యూచువల్ ఫండ్, ఐఎఫ్‌ఏ, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ డబ్బును పొదుపు చేయడమే కాకుండా.. పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, దీనికోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు దోహదపడుతున్నాయని యాక్సిస్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. సాధారణ ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, దీని కోసం ఫైనాన్షియల్ పరిస్థితులపై కొంత అవగాహన ఉంటే సరిపోతుందన్నారు. దీని కోసం ప్రత్యేక డిగ్రీలు అక్కర్లేవని, నిపుణుల సాయంతో పెట్టుబడులు పెడితే.. లాభాలు వస్తాయని వివరించారు. దీని కోసం కొన్ని కీలక విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. మార్కెట్‌లు ఎప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తాయో ఎవరూ చెప్పలేరని, పరిస్థితులను పరిశీలించి.. విశ్లేషించి.. ఊహించుకోవడం చేయాలన్నారు. లేదంటే నిపుణుల అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లాలని సూచించారు. ఇన్వెస్టర్లు.. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే సమయమే కీలకమని, ప్రవేశించే సమయం కాదన్నారు.
అర్థవంతమైన పోర్ట్ ఫోలియో..
తమ పెట్టుబడిని ఇన్వెస్టర్లు ఒకే చోట పెట్టడం శ్రేయస్కరం కాదు. పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ ఎంతో కీలకం. ఇది ఎంతో అర్థవంతంగా ఉండాలి. ఓ నిర్ధిష్ట తరహా విభాగపు ఫండ్స్‌కు అంకితం చేసినట్టుగా పోర్ట్‌ఫోలియోలో స్కీమ్‌లు ఉండకూడదు. ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, హైబ్రిడ్, గ్లోబల్ ఫండ్ మొదలైనవి చూడాలి. వీటిలో చురుగ్గా ఉండే వాటిలో పెట్టుబడులు పెట్టాలి. రిస్క్, రిటర్న్స్ మధ్య సంబంధం ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటే.. లాభం ఎక్కువ ఉంటుందనడం అవాస్తవం. అతి తక్కువ రిస్క్ తీసుకుని.. తగిన లాభాలు పొందొచ్చు. అసలు రిస్క్ లేకుండా కూడా లాభాలు గడించొచ్చు. అన్నింటికంటే ముఖ్యం.. నాణ్యమైన, తక్కువ సమయంలో అధికంగా లాభాలు వచ్చే సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెట్టడం అనేది ఒకరు చేసే అతి ప్రమాదకరమైన పనిగా మారొచ్చు. దీర్ఘ కాలంలో.. నాణ్యత, వృద్ధిని దీర్ఘ కాలంలో అందిస్తామని వాగ్దానం చేసే కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం అనేది సరైన విధానం. పరిస్థితులను పరిశీలించేందుకు సమయం లేనివారు.. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇది పెట్టుబడి పరిష్కారాలకు ఏకీకృత పరిష్కారంగా లభిస్తుంది.
కేటాయింపులపై దృష్టి..
నగదు పొదుపు చేయడంతో భవిష్యత్తుకు భద్రత ఉండకపోవచ్చు. పెట్టుబడిదారుల వివిధ అవసరాలకు సరిపోయే వినూత్న పథకాల ఆగమనాన్ని చూశాం. అందువల్ల మన లక్ష్యాలను చేరుకోవడానికి గరిష్ట సంభావ్యతను నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా కేటాయింపులపై దృష్టి పెట్టాలి. రిస్క్, పెట్టుబడి లక్ష్యాలు, కార్పస్, వయస్సు వాటిపై ఆధారపడి ఈక్విటీ, డెబ్ ్ట, హైబ్రిడ్, ఫిజికల్ ఎస్సెట్స్‌కు కేటాయింపులు చేయాలి. ఇది కేవలం రాబడులను గరిష్టం చేయడంలో సహాయపడటంతో పాటు రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా స్పందిస్తే.. అది రాబడికి ప్రమాదం కలిగించొచ్చు. తాత్కాలి మార్కెట్ కల్లోలాలు భవిష్యత్ రాబడులకు బెంచ్‌మార్క్‌గా పరిగణించబడవు. నిర్ధిష్టమైన రిస్క్‌తో పాటు పోర్ట్‌ఫోలియోను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం, వ్యూహాలకు అనుగుణంగా కాపాడుకోవడంలో దిద్దుబాట్లు చేయడం ముఖ్యం. సమాచారానికి అనుగుణంగా ప్రతిస్పందించడంతో పాటు తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కేవలం రిటర్న్స్‌పై ప్రభావం చూపడం మాత్రమే కాదు.. పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..