Sunday, November 24, 2024

పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలపై దృష్టి.. అవకాశం వస్తే స్వీకరిస్తానన్న హార్ధిక్‌ పాండ్యా ..

భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సిన బాధ్యతలు వస్తే తప్పకుండా నెరవేరుస్తా.. అయితే ప్రస్తుతం ఆసియా వరల్డ్‌ కప్‌ ఆగస్టు 27న మొదలవుతున్న తరుణంలో ముందు ఆటపై ఫోకస్‌ పెట్టాము. ప్రస్తుతం ఆడుతున్న భారత్‌ టీమ్‌ విజయాలతో ఎంజాయ్‌ చేస్తోందని.. మున్ముందు మరింత మెరుగైన టీమ్‌గా గుర్తింపు తెచ్చకుంటామని పాండ్యా తెలిపారు. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో వెస్టిండీస్‌ టూర్‌లో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ సారథిగా విజయాలు అందుకుంటూ.. భవిష్యత్తులో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే కూడా నెరవేరుస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. అంతేగాక ఇటీవల జరిగిన టీ20 సిరిస్‌లో ఐర్లాండ్‌ను 2-0తో గెలిపించాడు. ఇండియన్‌ టీమ్‌లో చాలా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న ప్యాండ్య కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా సారథిగా నిబంధనలు పాటిస్తూ వస్తున్నానని పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌ సిరీస్‌లో సీనియర్‌, ప్రతిభావంతమైన ఆటగాళ్లు లేకపోయినప్పటికీ 188 పరుగులు చేసిన టీమిండియా వెస్టిండిస్‌ను వంద పరుగులకే మట్టి కరిపించామన్నారు. స్కిప్పర్‌ రోహిత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, బ్యాట్స్‌ మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ లేకుండానే ఆదివారం జరిగిన మ్యాచ్‌ను సునాయాసంగా చేధించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛను ఇవ్వడంతో వారందరూ అద్భుతంగా ఆటతీరును ప్రదర్శిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ప్రస్తుత టీమ్‌లోని సభ్యులు తమ ప్రతిభను వెలికి తీస్తూ.. ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా ఆడుతున్నారన్నారు. విజయమే ధ్యేయంగా ఆటతీరును ప్రదర్శించకుండా టీమ్‌లో అందరూ కలిసికట్టుగా ఆటతీరును ప్రదర్శిస్తున్నారని చెప్పాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement