త్వరలో రోడ్ల పై నడిచే కార్లతో పాటు గాల్లో ఎగిరిపోయే కార్లను కూడా చూడనున్నారు. అమెరికాలో ఫ్లయింగ్ కార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలెఫ్ ఏరోనాటిక్స్ అనే సంస్థ రూపొందించిన ఎగిరే కారును రూపొందించింది. ప్రపంచంలోనే గాల్లో ఎగిరే తొలి విద్యుత్ కారు ఇదే. దీని ధర 3 లక్షల డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. ఇది మన కరెన్సీలో దాదాపు 2.4 కోట్లు. ఈ ఎగిరే కార్లు 2025 నాటికి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని అలెఫ్ ఎరోనాటిక్స్ వెల్లడించింది. కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కేంద్రంగా ఈ కారును తయారు చేశారు. ఈ కారులో ఇద్దరు ప్రయాణించడానికి వీలుటుంది.
ఈ కారును నడిపేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) నుంచి కూడా ప్రత్యేక ధృవీకరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు అరికట్టేలా దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఈ ఫ్లయింగ్ కారుకు 440కి పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు సాధారణంగా రోడ్డుపై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్కువ వేగంగా వెళ్లాలంటే దీనిలో ఉన్న వైమానిక సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలని కంపెనీ తెలిపింది. అప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణిస్తుంది.