Friday, November 22, 2024

Fly ban – ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ప్ర‌భుత్వం షాక్…నో ఫ్లై లిస్టులో మాజీ ప్ర‌ధాని..

ఇస్లామాబాద్ .. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కష్టకాలం కొనసాగుతూనే ఉంది.. ఇటీవలే అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు జోక్యంతో అతికష్టమ్మీద విడుదలయ్యారు. ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆయనపై 150 వరకు కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా నో ఫ్లై లిస్టులో ఆయన పేరు చేర్చింది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు నేతల పేర్లను కూడా ప్రభుత్వం నో ఫ్లై జాబితాలో పొందుపరిచింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇతర దేశాల్లో తనకేమీ ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంక్ అకౌంట్లు అంతకన్నా లేవని… తనను నో ఫ్లై జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక మే 9న జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, పీటీఐ పార్టీపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ ప్ర‌క‌టించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement