కరోనా పుణ్యమాని అందరూ మూతికి మాస్క్ లు కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికెళ్లిన మాస్క్ తప్పనిసరి అయిపాయే.. దీంతో మాస్క్ లు ధరిస్తే ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ..మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేవారున్నారు. ఇక పెళ్లిల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. పెళ్లంటే వందల మంది వస్తారు…అదరహో అనేలా ముస్తాబావుతారు పెళ్లికి వచ్చినవారు. ఇక వధువరుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..అంతలా తయారయిన కూడా ముఖాన్ని మాస్క్ తో కవర్ చేయాల్సి వస్తుండటంతో..జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిలో మాకు ఈ మాస్క్ ల గోళ ఏంటని కోందరు తెగ హైరాన పడుతున్నారు. అయితే వీరి కష్టాలు తీర్చేవిధంగా వింతగా ఆలోచన చేశాడు తమిళనాడుకు చెందిన పూల వ్యాపారి. పూలతో మాస్క్ లు తయారుచేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. రకరకాల పూలతో చక్కిటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరల ముసుగులో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు.
వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు.
ఇది కూడా చదవండి: టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి ప్రమాణ స్వీకారం