కృష్ణా బేసిన్‌లోని పలు జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,128 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 34,079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మరోవైపు నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కులు వరద వస్తుండగా.. వెయ్యి క్యూసెక్కులు ఔవుట్ ఫ్లో ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 538 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 184.1840 టీఎంసీలు నిల్వ ఉంది.
ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో గంట వ్యవధిలో రెండు చోరీలు