Sunday, October 6, 2024

Floods – అసోం వరద బాదితులకు రాహుల్ పరామర్శ

భారీ వరదలతో ఇప్ప‌టికే 78 మంది మృతి
కొండ చ‌రియ‌లు విరిగిపడి రవాణా వ్య‌వ‌స్థ‌కు అంత‌రాయం
పున‌రావాస శిబిరాల‌లో త‌ల‌దాచుకుంటున్న‌వేలాది మంది.
64 వేల ఏక‌రాల‌లో పంట‌లు నష్టం
7 ల‌క్ష‌ల మందికి పైగా నిరాశ్ర‌యులు

భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌లమైన అసోం వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం పర్యటించారు.మేందుగా ఆయన కచార్‌ జిల్లాలో సిల్చార్‌ను సందర్శించారు. ఎయిర్‌పోర్టులో అస్సాం, మణిపుర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను రాహుల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. . అక్కడ జిబామ్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. . ఆ తర్వాత చురాచాంద్‌పుర్‌, మోయిరాంగ్‌లో శిబిరాలను సందర్శించి బాధితులను ఓదార్చారు.

- Advertisement -

వ‌ర‌ద‌లకు 78 మంది బ‌లి..

అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్‌రూప్‌, నాగౌన్‌, కచార్‌, ధుబ్రి, గోల్‌పరా, మెరిగావ్‌, హైలాకండి, దక్షిణ సల్మార, దిబ్రూగఢ్‌ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. బ్రహ్మపుత్ర, బరాక్‌లతో కలిపి మొత్తం ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కామ్‌రూప్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రాష్ట్రంలో వేల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63,490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రి జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దర్రాంగ్‌లో 1,86,108.. బార్పేటలో 1,39,399.. మెరిగావ్‌లో 1,46,045 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 47,103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి.

https://twitter.com/INCIndia/status/1810197818679665106
Advertisement

తాజా వార్తలు

Advertisement