Tuesday, November 19, 2024

Floods – తమిళనాడులో భారీ వర్షాలు – ప్రమాదంలో వరదమ న‌ది డ్యామ్..

తమిళనాడులో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు కేరళలో ఇటు పాండీచేరిలో సైతం వానలు కురుస్తున్నాయి..ఇక త‌మిళ‌నాట నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల‌తో మొత్తం13 జిల్లాల‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి.. స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబ‌త్తూరు, నీల్‌గిరిస్‌, దిండిగల్‌, మధురై ప్రాంతాల‌లో వ‌ర‌ద‌లు ముంచేత్తుతున్నాయి.. వాగులు,వంక‌లు,న‌దులు పొంగిపొర్లుతున్నాయి..

అలాగే ఎగువ నుంచి వ‌స్తున్న వ‌రద‌నీటితో త‌మిళ‌నాడులో అనేక డ్యామ్ లు నిండుకుండ‌ల్లా మారాయి.. ముఖ్యంగా ప‌లని జ‌ల్లాల‌లో వ‌ర‌ద‌మ న‌ది డ్యామ్ పూర్తిగా నిండిపోయిది.. దీంతో గేట్ల పై నుంచి వ‌ర‌ద నీరు దిగువ‌కు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది.. డ్యాం ఓవ‌ర్ ప్లో అవుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.. డ్యామ్ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించారు.. వ‌ర‌ద హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు.. అత్య‌వ‌స‌ర స‌హాయం అందించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దింపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement