Tuesday, November 26, 2024

Floods – ఉత్తర భారతంలో వరదలు ఉగ్రరూపం – 19 మంది దుర్మరణం

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలు చోట్ల నదులు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల షాపులు, కారులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అనేక రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మొత్తంగా వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 19 మంది మరణించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ముంపునకు గురైన రహదారులపై వాహనాలు కాగితపు పడవల్లా తేలియాడుతున్నాయి. పలుచోట్ల నివాస ప్రాంతాలు, దేవాలయాలు, ఇతర నిర్మాణాలలోకి బురద నీరు ప్రవహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

.జమ్మూ కాశ్మీర్, లడఖ్ , హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అయితే ఢిల్లీలో 1982 తర్వాత జూలైలో ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement