అఫ్గానిస్థాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో విధ్వంసకర వరదల కారణంగా దాదాపు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐరాస వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షాలకు ఉత్తర అఫ్గానిస్థాన్ తీవ్రంగా ప్రభావితమైందని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి వరకు 62 మంది మృతి చెందారని తెలిపారు. బదాక్షన్, బఘ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో వరద బాధితులకు బలవర్థకమైన బిస్కెట్లను పంపిణీ చేస్తున్నట్లు ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement