Friday, November 22, 2024

Floods Effect – కుప్ప కూలిన బ్రిడ్జి – నదిలోకి దూసుకుపోయిన గూడ్స్

అమెరికా లో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలోకి దూసుకుపోయింది.

నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి. గూడ్స్ రైలు మోంటానాలోని ఎల్లోస్టోన్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే రైలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని మోంటానా రైల్ లింక్ ప్రతినిధి ఆండీ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు . నది నీటిలో ప్రమాదకర సల్ఫర్, వేడి తారు పడటంతో నది నుంచి మంచినీరు తీసుకోవడాన్ని నిలిపివేశారు.కలుషితమైన నది నీరు పొలాలకు వెళ్లకుండా కాల్వ వద్ద నిలిపివేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement