Saturday, November 23, 2024

నాగార్జున సాగ‌ర్ కు పోటెత్తిన వ‌ర‌ద‌… 26 గేట్లు ఎత్తివేత 

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులునాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో : 4,38,446 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 3,36,672 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం : 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 2009 తర్వాత మళ్లీ 2022 లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువ వదిలినట్లు అధికారులు తెలిపారు.

శ్రీ‌శైలం 10 గేట్లు ఎత్తివ‌తే…
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 3,88,717 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండటంతో అధికారులు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,79,110 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.60 అడుగులు ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement