Monday, November 25, 2024

Big story | పోటెత్తిన గోదావరి.. జలాశయాల్లోకి కొనసాగుతున్న ఇన్‌ ఫ్లో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వరుణి కటాక్షంతో తెలంగాణలో గోదావరితో పాటు ఉపనదులు పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తున్నాయి. నిండుతున్న జలాశయాలతో పాటు రాష్ట్రంలోని వాగులు వరదలు ఉధృతితో ప్రవహిస్తూ చెరువులను, కుంటలను నింపుకుంటూ గోదావరిలో సంగమించి జలాశయాల్లోకి చేరుకుంటున్న జలదృశ్యాలు రాష్ట్ర మంతటా పరుచుకున్నాయి. సింధువును చేరి బిందువు సింధువు అయినట్లు ప్రతివర్షంచుక్కులు ఏకమై సముద్రాలను తలపించే జలాశయాలు అగుపిస్తున్నాయి, గత 24 గంటల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ కనువిందు చేస్తుండటంతో చూసేందుకు ప్రజలు భారులు తీరుతున్నారు.

కాళేశ్వరం ప్రధాన పుష్కరఘాట్‌ దగ్గర 9.770 మీటర్లు ఎత్తులో గోదావరి ప్రవహిస్తూ జలపాతాలను తలపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజి ఇన్‌ ఫ్లో 4, 38, 880క్యూసెక్కులు ఔట్‌ ఫ్లో 4, 85,030 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16. 17 టీఎంసీలకు ప్రస్తుతం నీటిమట్టం 7,646 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో బ్యారేజీలోని 57 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.లక్ష్మీ పంపుహౌజ్‌ మోటర్లను సీఎంఓ ఆదేశాలకు నిలిపివేశారు.

- Advertisement -

గతకొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టునుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదల ఉధృతి పెరగడంతో మోటర్లను నిలిపి వేశారు, మరోవాపు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుండటంతో గ్రామాల్లోని వీధులన్నీ చిన్న పాటి వరదకాలువలుగా మారిపోయాయి. గోదావరినీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మహారాష్ట్ర,తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 41 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగితె, 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయాలని నీటిపారుదల శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

మేడిగడ్డను సందర్శించిన అధికారులు

వరదల ఉధృతి పెరగడంతో వేగంగా నిండుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ ను శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌ అధికారులు సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ గోయల్‌ ఆదేశాలతో కోర్సు డైరెక్టర్‌ రామచంద్రం సూచనలమేరకు నోడల్‌ ఆధికారలు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బ్యారేజ్‌ ను ఐఏఎస్‌ లు సందర్శించి ప్రవాహ తీరుతెన్నులు పరిశీలించారు.

శ్రీరాంసాగర్‌ వరద ఉధృతి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి వరదలు వస్తుండటంతో డటంతో ప్రాజెక్టులో క్రమేణ జల కళ సంతరించుకోంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 59,165 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు,ప్రస్తుతం ప్రాజెక్టులో 1073.6 అడుగుల నీరు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి సామర్ధ్యం 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 36 . 52 టీఎంసీల నీరు నిల్వఉంది. అయితే వరదలతో వేగంగా నిండుతున్న శ్రీరాంసాగర్‌ మరో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుందని అధికారులు అంచనావేస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదల ఉధృతి పెరగడంతో వేసవిలో డెడ్‌ స్టోరేజికి చేరుకుని కాళేశ్వరం ప్రాజెకు ఎత్తిపోతలకే పరిమితమయ్యాయి. అయితే వర్షాలు ఆలస్యంగా కురుస్తున్న భారీ గా కురవడంతో జలాశయాల్లోకి వరద నీరు చేరుకుంటుంది. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రాజెక్టు సామర్ధ్యం టీఎంసీలు, ప్రస్తుతం టీఎంసీలు ఇన్‌ ఫ్లో

సింగూరు 29.917 19.166 8,533
నిజాంసాగర్‌ 17.800 3.979 15.600
కడెం 7.600 5.587 8,033
లక్ష్మీ బరాజ్‌ 16.170 —— 6,22,600 సమ్మక్కసాగర్‌ 6.940 5.100 8,62,500
సీతారామ సాగర్‌ 36.570 0.2 8,53,045 శ్రీపాద 20.175 15.276 10,226

జిల్లాలవారిగా జలాశయాలు వరదలతో పోటెత్తుతున్నాయి. జిల్లాలవారిగా ఉన్న జలాశయాల్లోకి వరద ప్రవాహం చేరుతోంది.రంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 458.45 అడుగులు ఉండగా ప్రస్తుతం 453 కు చేరుకోగా 870 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుంది. మెదక్‌ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టు 463.17 అడుగుల సామర్ధ్యానికి 135 అడుగుల మేరకు నీరు చేరగా ఇన్‌ ఫ్లో గరిష్టంగా కొనసాగుతోందది. నిజామాబాద్‌

లోని రామడుగు లో 210.38, కామారెడ్డి పోచారంలోకి 1040,కౌలాస్‌ నాలా 860, ఆదిలాబాద్‌ మత్తిడివాగులోకి 322,నిర్మల్‌ స్వర్ణ లోకి 319,ఆసిఫాబాద్‌ వట్టివాగులోకి 1456ఎన్‌టీఆర్‌సాగర్‌ లోకి 106.44ఇన్‌ఫ్లోలు స్థానిక ప్రవాహాలనుంచి వచ్చి చేరుతున్నాయి. మంచిర్యాల గొల్లవాగు 1456, నీల్వాయి ప్రాజెక్టులోకి 500క్యూసెక్కుల ప్రవాహం చేరుకుంటుండటంతో ప్రస్తుతం 122 అడుగుల మేరకు నీటి నిల్వలు చేరుకున్నాయి.

జయశంకర్‌భూపాల్‌ పల్లిలోని బొగ్గులవాగు, మల్లువాగు,గుండాలవాగులో గరిష్టంగా నీటి ప్రవాహం చేరుతుండటంతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ములుగు లక్నవరం ప్రాజెక్టులో 204.50,అప్పర్‌ మానేరు లో 24.07టీఎంసీల నీటి సామర్ధ్యానికి 9.95టీఎంసీలు ఇండగా 9388క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. అలాగే నల్గొండ డిండీ ఆసిఫ్‌ నహర్‌, సూర్యాపేట మూసీ, వికారాబాద్‌ కోటపల్లి, వంగల్‌ పాకాల,ఖమ్మం వైరా, మహాబూబా బాద్‌ బయ్యారంలో దాదాపుగా 2వేల నుంచి 3750 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది.

గరిష్టంగా నీటి నిల్వలతో నిలిచిన జంటలాశయాలు

వరదలు పోటెత్తుతున్నా, వర్షాలు కురుస్తున్నా హైదరాబాద్‌ జంట జలాశయాలకు నీటిఎద్దడి తప్పడంలేదు. వికారాబాద్‌ నుంచి వచ్చే ప్రవాహాలకు అడ్డుగా బహుళ అంతస్తుల మేడలు ఉండటంతో వరదలు రావడంలేదు. మూసీ వరదలను తట్టుకుని హైదరాబాద్‌ కు తాగునీరు అందదించేందుకు నిర్మించిన హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ కు ప్రస్తుతం వరదలు చేరకపోవడంతో పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం నీరు క్రమేణ జంటజలాశయాల్లోకి చేరుకుంటుంది. ఉస్మాన్‌ సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లేవల్‌ 1790. అడుగులు (2.642 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1783.85 అడుగల్లో గరిష్టంగా నిలిచిపోగా ఇన్‌ ఫ్లో రావడంలేదు. అలాగే హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ 1763.50 అడుగులకు ప్రస్తుతం 1760 అడుగులు నీటి మట్టంఉంది. ప్రవాహాలు ఈ జంట జలాశయాలకు చేరుకోకపోయినప్పటికీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం నీటితో ఈమేరకు నీటి నిల్వలు చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement