పినపాక, (ప్రభ న్యూస్): నాలుగు రోజులు నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉగ్ర రూపం ఎత్తింది. ఈ క్రమంలో ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు పొంగి పొర్లుతోంది.. దీంతో ఏడూళ్ల బయ్యారం గ్రామంలోకి నీరు చేరింది. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లోకి నీరు చేయడంతో ప్రజలు సామాన్లను భద్రపరుచుకుంటున్నారు. రాత్రి నుండి వరద పెద్ద ఎత్తున వస్తోంది. అధికారులు నిద్రహరలు మాని సహయక చర్యలు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement