Monday, October 21, 2024

Flood Water – తుంగభద్ర, కృష్ణకు కొనసాగుతున్న వరద …

కర్నూల్ బ్యూరో – కర్ణాటక, ఎగువన కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్ర, కృష్ణా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా నిండుకుంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉండడంతో డ్యాం కు చెందిన 12 క్రస్ట్ గేట్లలో ఆరు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైల జలాశయం నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 884.70 అడుగులకు, 214.8050 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇక జలాశయంకు కృష్ణ,తుంగభద్ర నుంచి 2,17,514 క్యూసెక్కుల నీ టి ప్రవాహం చేరుతుంది. ఇందులో జూరాల నుంచి 1.29 లక్షలు, తుంగభద్ర సుంకేసుల రోజా మీదుగా 88,347, అందరి నుంచి క్యూసెక్కుల నీరు డ్యామ్ కి చేరుతుంది.

ఇక డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం మూలంగా శ్రీశైలం జలాశయం కు మొత్తం 2,22,641 నీటి ప్రవాహం ఉంది. ఇదే క్రమంలో డ్యాం కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 60,173 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

ఇందులో ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 30,508 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 29,665 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

ఇక జలాశయం చెందిన ఆరు ప్రధాన గేట్ల ద్వారా 1,67,898 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు విడుదల అవుతుండడం విశేషం.

శ్రీశైలంకు పోటెత్తిన జనం

శ్రీశైలం జలాశయం కు జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలించారు. తమ ఇష్టా దైవమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటు న్నారు. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం సందర్శనకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.

దీంతో ఆ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది. జలాశయం నుంచి దిగువకు వస్తున్న తెల్లటి నీటి పరవళ్లనుతిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతున్నారు. తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతూ తన్మయంలో మునిగిపోతున్నారు. సెల్ఫీలతో అందాలను చిత్రీకరిస్తున్నారు. వీటి మూలంగాశ్రీశైలం జలాశయం వద్ద ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుండగా.. పోలీసులు వాటిని క్లియర్ చేస్తూ.. కనిపించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోని 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,61,422 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు..

.ఇన్ ఫ్లో, 1,89,123 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,02,956 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…

Advertisement

తాజా వార్తలు

Advertisement