Saturday, November 23, 2024

ప్రపంచానికి వరద ముప్పు..! పెరుగుతన్న ఉష్ణోగ్రతలే కారణం..

యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా.. (యూఈఏ) ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని తెలిపింది. భారతదేశంలోని పలు ప్రాంతాలకు ఈ గండం ఉందని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి కారణమని అధ్యయనం చెబుతున్నది. నదీ పరివాహక ప్రాంతాలు మునిగేపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూఈఏ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై యూఈఏ అధ్యయనం చేసింది. 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగిందని వివరించింది. భారతదేశం, చైనా, ఇథియోపియా, ఘనా, బ్రెజిల్‌తో పాటు ఈజిప్టులోని కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. యూఈఏ బృందం.. 2100 నాటికి 1.5 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఆరు గ్లోబల్‌ వార్మింగ్‌ స్థాయిల కోసం ఫ్లూవియల్‌ వరద ప్రమాదాలను పరిశీలించింది. వివిధ ఖండాల్లోని స్థాయిల అభివృద్ధి, గణనీయమైన పరిమాణంలో ఉన్న ఆరు దేశాలను ఈ అధ్యయనం పరిశీలించింది. నెలవారీ పరిశీలనలు, రోజువారీ పునర్‌ విశ్లేషణ డేటా, ఐదు కపుల్డ్‌ మోడల్‌ ఇంటర్‌ కాంపారిజన్‌ ప్రాజెక్టు ఫేజ్‌ -5 (సీఎంఐపీ-5)లో అంచనా వేసిన మార్పులను గమనించింది. వరద ఉప్పెనలు, హైడ్రోలాజికల్‌, హైడ్రో డైనమిక్‌ మోడల్స్‌ను పరిశీలించేందుకు ఈ సిరీస్‌లను ఉపయోగించబడ్డాయి.

గ్లోబల్‌ వార్మింగే కారణం..

యూఈఏ స్కూల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ యీ హీ మాట్లాడుతూ.. మా ఫలితాల ప్రకారం.. 20వ శతాబ్దం చివర్లో.. 100 సంవత్సరాల్లో ఒకదాని తరువాత ఒకటి వరదలు వచ్చే అవకాశాలున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ దీనికి కారణం. గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గిస్తేనే.. వరదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ పరిస్థితి చేయి దాటిపోతే.. ఎక్కువ ప్రాంతాలు ముప్పునకు గురవుతాయి. ముఖ్యంగా 4 డిగ్రీల సెల్సియస్‌ భూమి వేడెక్కుతుంది. ఆరు దేశాల్లోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది చైనాలో రెట్టింపు నుంచి ఈజిప్టులో 50రెట్లు ఎక్కువగా ఉంటుంది. 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తే.. ప్రమాదం రాకపోవచ్చు. ఫలితంగా చైనాలో 12 శాతం, ఈజిప్టులో 13 రెట్లు పెరుగుతుంది. ప్రతీ 100ఏళ్ల ఒకసారి వరదలపై అధ్యయనం ఉంటుంది. 1000 ఏళ్ల వ్యవధిలో.. 100 ఏళ్లలో ఒక సంవత్సరం సమానం లేదా పది రెట్లు మించి ఉంటుంది.ఇప్పటికే వాతావరణ పరమైన మార్పులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో.. బ్రిటన్‌, జర్మనీ, యూఎస్‌, ఆస్ట్రేలియా, చైనాలోని కొన్ని ప్రాంతాలను వరద తాకింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత రికార్డులను బ్రేక్‌ చేసింది. గ్లోబల్‌ వార్మింగ్‌తో మహా సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతున్నది. వాతావరణం వేడెక్కడమే దీనికి కారణం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. భారీ వర్షాలను హెచ్చరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement