Monday, November 4, 2024

Flood Info | జూరాల 17 గేట్స్ ఓపెన్.. లక్ష కూసెక్కులు బయటికి

ఆంధ్ర‌ప్ర‌భ, హైదరాబాద్: క‌ర్నాట‌క రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా.. ఆల్మ‌ట్టి, నారాయ‌ణ‌పూర్ డ్యామ్ ల‌ నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణ‌మ్మ త‌ర‌లి వ‌స్తోంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలో ఉన్న ఇందిరా ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టుకు 90800 క్యూసెక్కుల వ‌ర‌ద‌ నీరు వ‌స్తోంది.

దీంతో జూరాల ప్రాజెక్టు అధికారులు 17 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వ‌దులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీటితోపాటు, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్‌కు నీరు విడుద‌ల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పాద‌న‌కు 33084 క్యూసెక్కుల నీరు విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అలాగే, నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 870 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాల్వ ద్వారా 467 క్యూసెక్కులు… మొత్తం ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 6.202 టీఎంసీలు కాగా… శనివారం రాత్రి 9 గంటల వరకు 3.938 టీఎంసీల నీరు ఉంది..

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతొంది. ఇన్ ఫ్లో 99,894 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 814.50 అడుగుల నీరు ఉంది.. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 37.0334 టీఎంసీల నీరు ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement