Monday, November 18, 2024

వరద బీభత్సం.. 400 మందికిపైగా మృతి

వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించ‌డంతో 400మందికి పైగా మృతిచెందిన ఘ‌ట‌న‌ ఆఫ్రికా దేశమైన కాంగో లో చోటుచేసుకుంది. అక్క‌డ‌ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ దేశం అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి.. దక్షిణ కివు ప్రావిన్స్ ‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో పలుచోట్ల ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి.

వరదలకు తోడు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ విపత్తులో ఆ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్‌ తియో గ్వాబిజే కాసీ వెల్లడించారు. వందలమంది గల్లంతయ్యారని తెలిపారు. కివు లోయలో బురదలో మృతదేహాలు కూరుకుపోయినట్లు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement