పాపులర్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్.. సేల్స్ సునామీ సృష్టిస్తోంది. వెంట వెంటనే సేల్స్ నిర్వహిస్తోంది. ముందుగా బిగ్ బిలియన్ డేస్.. ఆ తర్వాత బిగ్ దసరా సేల్ జరిపింది. ఇక ఇప్పుడు బిగ్ దివాళీ సేల్ తీసుకొచ్చింది. నేడే (అక్టోబర్ 10) ఈ దివాళీ సేల్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చేసింది. సాధారణ యూజర్లందరికీ అక్టోబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బిగ్ దీపావళి పేరుతో ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ప్లస్ సభ్యులకు ఇప్పటికే ఇది మొదలైందిన. కోటక్ బ్యాంక్, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇటీవలి బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అత్యధికంగా అమ్ముడుపోయినవి స్మార్ట్ ఫోన్లే. దీంతో దీపావళి సేల్ లోనూ పలు స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. దీపావళి సేల్ సందర్భంగా మళ్లీ పాపులర్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చేసింది. స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్లు లాంటి ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియనెస్స్పై డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్‌లో కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే 10శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాపులర్ స్మార్ట్ఫోన్లు ఐఫోన్ 13, నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6ఏ ఈ ఫ్లిప్‌కార్టు బిగ్ సేల్ లో మరోసారి డిస్కౌంట్లు ఉన్నాయి.
ఐఫోన్ 13 128జీబీ మోడల్ రూ.58,990 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ జీటీ నియో 3టీ, రియల్మీ 9 5జీ ఎస్ఈ, ఒప్పో రెనో 8 5జీ, రియల్మీ జీటీ2, పోకో ఎక్స్4 ప్రో 5జీ, షావోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ, సామ్సంగ్ గెలాక్సీ21 ఎఫ్ఈ 5జీ మొబైళ్లపై ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ లో డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే చాలా స్మార్ట్ఫోన్లు ఆఫర్లతో లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలపైనా ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ వై1 40 ఇంచులు, ఎల్జీ 32 ఇంచులు, ఐఫాల్కన్ 55 ఇంచుల 4కే, సామ్సంగ్ 43 ఇంచుల 4కే, ఎంఐ 50ఏ 30 ఇంచుల స్మార్ట్ టీవీలపై 50శాతం వరకు డిస్కౌంట్ ఉంది. షావోమీ, వన్‌ప్లస్, రియల్మీ ఐఫాల్కన్, సామ్సంగ్, ఎల్జీతో పాటు మిగిలిన బ్రాండ్స్ స్మార్ట్ టీవీలు తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్లు లాంటి హోమ్ అప్లియెన్సెస్‌పై ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ లో 50 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.