Saturday, June 29, 2024

TS | హైదరాబాద్ నుండి అయోధ్యకు విమాన సర్వీసులు

బలరాముడి దర్శనానికి అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభవార్త… హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్టు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసును ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు.

వచ్చే నెల ఏప్రిల్ 2 నుంచి వారంలో 3 రోజులు (మంగళ, గురు, శనివారాలు) హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పైస్ జెట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఉదయం 10:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 01:25 గంటలకు తిరిగి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement