న్యూయార్క్ – అమెరికా విమాన సర్వీస్ లను క్రమబద్దం చేసే కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో బుధవారం 4 గంటల నుంచి అమెరికా మొత్తం విమాన సర్వీస్ లు నిలిచిపోయాయి.. అలాగే ఇప్పటికే ప్రయాణీస్తున్న విమానాలను సమీపంలోని విమానాశ్రయాలలో దించివేశారు. సాంకేతిక లోపం గురించి అమెరికా పెడరల్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, లోపాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది.. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పౌర విమాన యాన సర్వీస్ లను పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొంది.. ఇతర దేశాల నుంచి వస్తున్న విమానాలను క్రమబద్దీకరిస్తున్నమని పేర్కొంది. కంప్యూటర్ వ్యవస్థ కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణీకులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement