Saturday, November 23, 2024

పంజాబ్ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. సిద్ధూని కాదని కొత్తవారికి పీసీసీ చీఫ్ పదవి

మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేషనల్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్‌గా నియమించడం ఆ పార్టీ మాజీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ శిబిరంలో మంట పుట్టించింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొత్త కాంగ్రెస్ చీఫ్.. కొత్త CLP నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, డిప్యూటీ CLP నాయకుడు రాజ్‌కుమార్ చబ్బెవాల్‌లను అభినందించగా.. అతని మద్దతుదారులు శనివారం రాత్రి ప్రకటించిన నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించారు.

రాజా వారింగ్‌కి అభినందనలు. భరత్ భూషణ్ ఆశు వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. అని నవజ్యోత్ సిద్ధూ ట్వీట్ చేశారు. అమర్‌గఢ్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, సిద్ధూ మద్దతుదారు సుర్జిత్‌ సింగ్‌ ధీమాన్‌ కొత్త నియామకాలపై స్పందిస్తూ.. కొత్త పీసీసీ చీఫ్‌ అనుభవం లేని వ్యక్తి అని, ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమించడం పార్టీకి ఎదురుదెబ్బ అని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ అత్యంత అవినీతిపరుడని, ఆయనను నియమించాలనే నిర్ణయం తప్పని తెలిపారు. ఈ నిర్ణయం పంజాబ్‌లో పార్టీని దెబ్బతీస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఈ షాక్ నుండి ఎక్కువ కాలం బయటపడదు అని ధీమాన్ అన్నారు. కొత్త పిసిసి చీఫ్‌కు అవసరమైన మద్దతు లేదు కాబట్టి నాయకుడిగా అంగీకరించలేం అని ఆయన పేర్కొన్నారు.

సుర్జిత్ ధీమాన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ప్రశంసలు కురిపించారు. సిద్ధూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారని, పిసిసి చీఫ్‌గా తొలగించబడిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉన్నారని అన్నారు. మరోవైపు, రాజా వారింగ్ బాదల్స్ కాళ్లపై పడి వారితో రాజీ పడ్డాడు’ అని ధీమాన్ చెప్పాడు. ఇదిలావుండగా మాజీ ఎమ్మెల్యే బటాల అశ్విని శేఖరి, మాజీ జండియాలా ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ డానీ సహా ఆయన శిబిరానికి చెందిన పలువురు నేతలు ఆదివారం అమృత్‌సర్ నివాసంలో నవజ్యోత్ సిద్ధూను కలిశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement