భారత్‌లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ 87.9 శాతం సమర్థవంతంగా పని చేసిందని ఫైజర్ పేర్కొంది. యూకేలో నిర్వహించిన అధ్యయనంలో 26శాతం మంది బ్రిటీష్ భారతీయులు పాల్గొన్నారని, అలాగే ఆసియాకు చెందిన పౌరులపై సైతం ట్రయల్స్ నిర్వహించినట్లు పేర్కొంది. 12 ఏళ్లు, అంతకు మించి వయస్సున్న వారి కోసం ఇచ్చేందుకు తమ వ్యాక్సిన్ సిద్ధమని, భారతీయులపై జరిపిన పరిశోధనల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది.
ఈ మేరకు భారత్‌లో అత్యవసర వినియోగానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఫైజర్ విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్‌ను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నెల రోజుల వరకు నిల్వ చేయవచ్చని కూడా తెలిపింది. జూలై నుంచి అక్టోబర్ వరకు ఐదు కోట్ల డోసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిహారంతో పాటు పలు నిబంధనలు సడలించాలని కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.