Saturday, November 23, 2024

భారత్ ర‌కం వేరియంట్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోన్న ఫైజర్‌, మోడెర్నా

భారత్‌లో విజృంభిస్తోన్న కొత్తరకం కరోనా వేరియంట్  బి.1.617తో పాటు బి.1.618 వేరియంట్ పై కూడా అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్‌, మోడెర్నా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. ఫైజర్‌, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు 3-4 రెట్ల‌ అధికంగా ప్రభావవంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని గుర్తించినట్లు చెప్పారు. అధిక శాతం ప్ర‌తిర‌క్ష‌కాలు ఈ వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్నవారి నుంచి  నమూనాలను సేకరించామ‌ని, వాటిని ల్యాబ్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించినట్లు అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. శ‌రీరంలోని ఏసీఈ2 కణాలు కరోనా గ్రాహకాలుగా మారుతున్నాయని, ఈ కారణంగానే కరోనా వ్యాపించే తీరులో అనేక మార్పులొస్తున్నట్లు వారు చెప్పారు. అయితే, ఆయా వేరియంట్లను వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయ‌ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ల‌ను వేయడం ద్వారా క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement