Monday, November 18, 2024

స్థిరంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు..

ముంబయి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ లీటర్‌ పెట్రోల్‌పైన రూ 8. లీటర్‌ డీజిల్‌ పైన రూ 6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. అప్పటి దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లిలో రూ 9.5, లీటర్‌ డీజిల్‌ రూ 7 తగ్గింది. దీంతో ఢిల్లిలో లీటర్‌ పెట్రోల్‌ రూ 109.66, లీటర్‌ డీజిల్‌ రూ 97.82గా ఉంది.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80శాతం దిగుమతుల ద్వారా వస్తున్నా యి. అయితే కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్‌ సంస్థలకు లీటర్‌ పెట్రోల్‌ పైన రూ. 13.08, డీజిల్‌ పైన రూ 24.09నష్టం వాటిల్లుతోంది. దీంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు కేంద్ర జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement