హైదరాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే ఐదు పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్స్ సాధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్టమైన పనితీరును ప్రదర్శించినందుకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 28న భువనేశ్వర్లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జిఎంఅరుణ్ కుమార్ జైన్ సహా సంబంధిత విభాగాల అధిపతులు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా అందుకోనున్నారు.
సెక్యూరిటీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ విభాగాల్లో ఈ అవార్డులు దక్షిణ మధ్య రైల్వేకు దక్కాయి. ఐదు ఆలిండియన్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డులను సాధించడం పట్ల రైల్వే సిబ్బందిని ఇన్చార్జ్ జిఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..