ఒక బైక్ పై ఎంత మంది వెళ్లొచ్చు.. ఇద్దరు మహా అయితే ముగ్గురు కాని ఈ వీడియోలో ఓ బైక్పై నలుగురు వెళ్తున్నారు. అదే చిత్రం అనుకుంటే ఆ నలుగురిలో ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కాకుండా మిగతా వెనక కూర్చున్న ముగ్గురూ మరో వ్యక్తిని తమ చేతులతో పట్టుకొని మోసుకెళ్తున్నారు. అతను వాళ్ల తొడలపై పడుకుని ఉన్నాడు. వాళ్లు ఆయన్ని ఏమాత్రం పట్టు జారకుండా పట్టుకున్నారు. దాంతో అతను సూపర్ మేన్లా గాల్లో తేలినట్లుగా దూసుకుపోతున్నాడు. అతన్ని కూర్చోబెట్టేందుకు బైక్పై ప్లేస్ లేకపోవడంతో ఇలా ఎరేంజ్ చేసుకున్నారు. చూసిన వాళ్లు మొదట ఆశ్చర్యపోతున్నారు తర్వాత నవ్వేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ దేవరాజ్సింహ్ చౌహాన్ అనే నెటిజన్ ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ని మీరు చూడండి.
Advertisement
తాజా వార్తలు
Advertisement