కెనడాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంటారియో హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. శనివారం జరిగిన ప్రమాదం విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కెనడాలోని భారత దౌత్యవేత్త అజయ్ బిసారియా ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కెనడాలోని భారత దౌత్యకార్యాలయ సిబ్బంది మృతుల స్నేహితులు, బంధువులతో సంప్రదిస్తోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తుందని బిసారియా పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మరణించినవారిని హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరన్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌లుగా గుర్తించినట్లు ఒంటారియో పోలీసులు చెప్పారు. కాగా భారతీయ విద్యార్థుల మరణం పట్ల విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..