Saturday, November 23, 2024

500 మంది వైద్య సిబ్బందికి కరోనా

భీహర్ రాజధాని పాట్నాలోని రెండు ప్రధాన ఆస్పత్రులైనా ఎయిమ్స్‌, పాట్నా మెడికల్‌ కళాశాల – హాస్పిటల్‌లో 500 మందికిపైగా వైద్యులు, సిబ్బంది కరోనా భారిన పడ్డారు. ఎయిమ్స్‌లో 384 మంది ఉద్యోగులు, వైద్యులు, నర్సులు, సఫాయి కర్మాచారిలు, 125 మంది సిబ్బందికి కరోనా సోకిందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ సీఎం సింగ్‌ తెలిపారు. పీఎంసీహెచ్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వసతి కల్పించినట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. పెద్ద సంఖ్యలో సిబ్బంది వైరస్‌ బారినపడడంతో సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలపారు.బిహార్‌లో నిన్న 12,222 మంది కరోనా మహమ్మారి బారినపడగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో ప్రస్తుతం 63,745 యాక్టివ్‌ కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement