బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వేగంగా వచ్చి ఓ తినుబండారాల దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహురా కూడలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బహురా కూడలి సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న తినుబండారాల దుకాణాన్ని ఢీకొట్టిందని పటేపూర్ ఎస్హెచ్ఓ రామశంకర్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement