న్యూఢిల్లీ – లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం అయిదు రోజులు తమ కస్టడీకి ఇవ్వవలసిందిగా సిబిఐ కోర్టును అభ్యర్ధించింది.. దీనిపై న్యాయస్థానంలో సిసోడియా తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిందని తెలిపారు. సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సిసోడియా అరెస్ట్ జరిగిందని అన్నారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇదే కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిసోడియాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను సీబీఐకి అప్పగించడం జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు.. అయినప్పటికి రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement