Saturday, November 23, 2024

ఈవీ దిగ్గజం ఫిస్కర్‌ డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు…

ఇక ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్‌, హైదరాబాద్‌లో ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంతో ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లాస్‌ఏంజిల్స్‌లోని ఈ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో హెన్నీక్‌ ఫిష్కర్‌, సీఎఫ్‌వో గీతా ఫిష్కర్‌లతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేస్తున్నాయన్నారు. ఇక జడ్‌ శ్రీప్‌ , హ్యుండై వంటి పలు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ టెక్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నవిషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్‌ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించామన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కేటీఆర్‌ అందిస్తామన్నారు.ఆటోమొబైట్‌ పరిశ్రమలకు సంబంధించిన డిజైన్‌రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌కు హైదరాబాద్‌లో అద్భుతవమైన అవకాశాలున్నాయన్న కేటీఆర్‌, ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగస్వాములవ్వాలని ఫిస్కర్‌ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్‌ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్‌లో భాగస్వాములయ్యేందుకు ఫిస్కర్‌ ప్రతినిధులు అంగీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement