Tuesday, November 26, 2024

తెలంగాణలో ఫిషింగ్ పాలసీ.. మంచి నీటి చేపల పెంపకానికి చర్యలు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: రానున్న రోజులలో మంచినీటి చేపలను ప్రపంచానికి అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించేలా సమగ్ర విధా నాన్ని రూపొందించాలని, రాష్ట్రంలో మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ఒక సమగ్రమైన పాలసీని తయారు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నిన్న‌ మాసాబ్‌ ట్యాంక్‌ లోని తన కార్యా లయంలో ఇరిగేషన్‌, మత్స్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నీటి వనరులను సమర్ధవంతంగా నియోగించుకోవడం వలన మత్స్య సంపదను మరింత ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ప్రస్తుతం మత్స్యశాఖ పరిధిలో 15 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి సామర్ధం కలిగిన 23 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని, మిగిలిన చేప పిల్లలను ఇతర రాష్ట్రాల్ర నుండి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రిజర్వా యర్‌ల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను మత్స్య శాఖ కు కేటాయిస్తే వాటిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు-, శీతల గిడ్డంగులు వంటి కార్యకలా పాలు నిర్వహించేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తద్వారా రాష్ట్ర అవసరాలకు పూర్తిగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement