Saturday, November 23, 2024

రూ 32 వేల కోట్లతో మత్స్యకారుల అభివృద్ధి : కేంద్ర మంత్రి మురుగన్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : మత్స్యకారుల సంక్షేమం కోసం గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ 32 వేల కోట్లు వ్యయం చేసిందని కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ తెలిపారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని గురజాడ విద్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మత్స్యకార ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల జీవన స్థితి గతుల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనా పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందన్నారు.

ఆత్మనిర్బర్‌ లో భాగంగా మత్స్యసంపద అభివృద్ధికి రూ 20 వేలకోట్లు కేటాయించినట్టు తెలిపారు.ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌ గ్రేషియా అందిస్తున్నాం..మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ 7500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మత్స్యకారులను ఎస్‌.టి.జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తీరప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement