Saturday, November 23, 2024

ద్రవ్యలోటు 0.50 శాతం తగ్గించాలి.. ఈ సారి బడ్జెట్‌లో తగిన చర్యలు

ద్రవ్యలోటును కనీసం 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటును 6 శాతం కంటే తక్కువకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. 2024లో మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది. ఎన్నికల పేపథ్యంలో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం ఎ క్కువగానే ఖర్చు చేసే అవకాశం ఉంది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆహారం, ఇంధన బిల్లుల భారం పెరిగింది. ఎగుమతులు భారీగా తగ్గాయి. దీని వల్ల కరెంటు ఖాతాలోటును ఎదుర్కొంటోంది. రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడింది. ఆహారం, ఎరువులు, ఇంధనంపై సబ్సిడీలు 2023 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్ధికప సంవత్సరంలో కనీసం 67 బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలవుతున్న బడ్జెట్‌లో ఈ మొత్తం 39.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడంతో, దీన్ని నిరోధించేందుకు ఆర్బీఐ ఇప్పటికే తన ఖజానా నుంచి 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.

విదేశీ పెట్టుబడుల సాయంతో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు మన దేశాన్ని ఆకర్షనీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతం వరకు ఉంది. కోవిడ్‌ సమయంలో ఇది 9.2 శాతానికి చేరింది. 2025-26 నాటికి ఈ లోటును జీడీపీలో 4.5 శాతానికి కంటే తక్కువకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉక్రెయిన్‌- రష్యా సంక్షోభం, దాని ప్రభావంతో ఇంధన, ఆహార వ్యయాలు పెరిగాయి. ఇదే సమయంలో కరోనా పరిణామాల ఫలితంగా సరఫరా ఇబ్బందులు తోడయ్యాయి.

- Advertisement -

ఫలితంగా అధిక ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయని ఆర్బీఐ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని వరసగా మూడు త్రైమాసికాల పాటు నియంత్రిత లక్ష్యమైన 2-6 శాతం పరిధిలో ఉంచడంలో ఎందుకు విఫలమైందీ, కారణాలు తెలుపుతూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేంద్రానికి ఒక నివేదిక సమర్పించింది. ఇందు కోసం ఎంపీసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ నివేదికంలో ఈ నెల మొదటి వారంలోనే కేంద్రానికి సమర్పించింది. దీనిలో ఉన్న కొన్ని అంశాలు బయటకు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయ అంశాల వల్లే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి విసయంలో గరిష్టాన్ని అధిగమించినట్లు, భవిష్యత్‌లో అందటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.

రెపోరేటు 6.4 శాతం

ఈ సంవత్సర కాలంలో రెపోరేటు ప్రస్తుతం 5.9 శాతం నుంచి 6.4 శాతం నుంచి 5 శాతానికి తగ్గవచ్చని బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. శక్తికాంతదాస్‌ ద్రవ్యోల్బణంపై గతంలో చెప్పిన అంచనాలకు అనుగుణంగా ఇవి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement