Friday, November 22, 2024

నాగాల్యాండ్ చ‌ట్టస‌భ‌లో తొలిసారి ఆమెకు ప‌ట్టాబిషేకం..

కోహిమా: పుడమి నుంచి అంతరిక్షం వరకు అన్నిరంగాల్లో అ తివలు అద్భుతాలు సృష్టిస్తున్న శతాబ్దమిది. మరీ ముఖ్యంగా భార తీయ మహిళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సంద ర్భమిది. అలాంటిది నాగాలాండ్‌ అసెంబ్లిలోకి అడుగు పెట్టడానికి ఆమెకు 60 ఏళ్లు పట్టింది. రాష్ట్రం ఏర్పడి ఆరు దశాబ్దాలు గడిచినా నిన్నటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా ఎమ్మెల్యే ఎన్ని కవలేదు. కానీ 2023లో ఆ ప్రతిష్టంభన తొలగింది. అడ్డంకులన్నీ తొలగించుకుని ఏకంగా ఇద్దరు మహిళలు క్రూసే, హకానీ జఖాలు రాష్ట్రంలోని కీలక చట్టసభలోకి ప్రవేశం పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఈశాన్య భారతంలో చరిత్ర సృష్టిం చారు. వీరిద్దరిలో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంగళవారం మంత్రిగా ప్రమాణం చేసి మరో అడుగు ముందుకేశారు. 60 మంది సభ్యులున్న నాగాలాండ్‌ అసెంబ్లిలో గరిష్టంగా 12 మందిని మం త్రివర్గంలోకి తీసుకోవచ్చు. నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ సభ్యురాలైన క్రూసేకు కాన్రాడ్‌ సంగ్మా కేబినెట్‌లో చోటుదక్కింది.

దురదృష్టం వెంటే.. అదృష్టం..
గత 24 ఏళ్లుగా సామాజిక కార్యకర్తగా సేవలు అందించిన క్రూసే, కోహమా జిల్లాలోని పశ్చిమ అంగామి నియోజకవర్గం నుంచి కేవలం 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. కిందటిసారి ఎన్ని కల్లో ఆమె భర్త పోటీచేసి ఓడారు. 2021లో కోవిడ్‌తో మరణిం చాడు. దాంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశం క్రూసేకు లభించింది. అదృష్టమూ వరించింది. ఎమ్మెల్యేగా గెలిచింది. కాలమూ కలిసొచ్చింది. ఏకంగా మంత్రి పదవి దక్కించుకుంది. 55 ఏళ్ల క్రూస్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఉల్లాసంగా కనిపించా రు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగి నదంతా చేస్తాను. ధైర్యంగా, చిత్తశుద్ధితో, కష్టపడి పనిచేసేలా మహళలను ప్రోత్సహస్తాను. తద్వారా మహిళలకు దక్కాల్సిన అవకాశాలను వారికి చేరువయ్యేలా చేస్తాను. మహిళా సాధికారత కు నా వంతు కృషి చేస్తాను అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement