Saturday, November 23, 2024

First Test – అసీస్ బౌలింగ్ కు పాత‌ర – భార‌త్ కు ప‌రుగుల జాత‌ర

పెర్త్ టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. ఆసీస్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డిన చోట‌ ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్)లు ప‌రుగులుతో కుమ్మేశారు. ప్ర‌పంచ స్థాయి పేస్ ద‌ళాన్ని అల‌వోక‌గా ఎదుర్నొన్న ఈ జోడీ అజేయ అర్ధ శ‌త‌కాల‌తో కంగారూ బౌలర్ల‌ను కంగారెత్తించింది. బంతి మ‌రీ బౌన్స్ కాక‌పోవ‌డంతో నింపాదిగా ఆడుతూ టీమిండియా ఆధిక్యాన్ని రెండొంద‌లు దాటించారు. రెండో రోజు ఆట ముగిసే స‌రికి భార‌త జ‌ట్టు వికెట్ కోల్పోకుండా 172 ప‌రుగులు చేసింది. దాంతో.. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో బుమ్రా సేన బోణీ కొట్టే దిశ‌గా సాగుతోంది. ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడంతో భారత్ 218 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో ఉంది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 67/7 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టును టీమిండియా బౌలర్లు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఓవ‌ర్ నైట్ స్కోరు 67/7 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మ‌రో 37 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవ‌ర్‌లోనే బుమ్రా షాకిచ్చాడు. తొలి బంతికే అత‌డు కేరీని ఔట్ చేశాడు. 19 ప‌రుగుల వ్య‌కిగ‌త స్కోరుతో రెండో రోజు మ్యాచ్ ఆరంభించిన కేరీ మ‌రో రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మ‌రి కాసేప‌టికే హ‌ర్షిత్ రాణా బౌలింగ్ నాథ‌న్ లియాన్ ఔట్ అయ్యాడు.


అయితే.. ఆఖ‌రి వికెట్ మాత్రం అంత త్వ‌ర‌గా రాలేదు. జోష్ హేజిల్ వుడ్‌(7 నాటౌట్‌)తో క‌లిసి మిచెల్ స్టార్క్ జ‌ట్టు స్కోరు వంద దాటించాడు. ప‌దో వికెట్‌కు వీరిద్ద‌రు 25 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన అనంత‌రం హ‌ర్షిత్ రాణా బౌలింగ్ స్టార్క్ ఔట్ కావ‌డంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల‌లో కెప్టెన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. హ‌ర్షిత్ రాణా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. అంత‌క‌ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement